Party Defections Case:బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ తుది దశకు చేరుకున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను ఇప్పటికే ప్రారంభించారు. ఆ 10 మందిలో నలుగురిని ఆయన విచారించారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేల విచారణను అక్టోబర్ 24 నుంచి చేపట్టనున్నారు.
Party Defections Case:తొలి దశలో చేవెళ్ల, పటాన్‌చెరు, గద్వాల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలైన కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్‌లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇప్పటికే విచారించారు. వారిని ఇరు పక్షాల న్యాయవాదులతో క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, తాము కాంగ్రెస్ లో చేరలేదని తమ ఎమ్మెల్యేలతో వాదనను వినిపించారు.
Party Defections Case:టూర్ నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేల విచారణకు విరామం ఇచ్చారు. విచారణ సమయంలో వారు తమ తరఫున అఫిడవిట్లను సమర్పించారు. బీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరై తమ వాదనలు వినిపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఆధారాలను స్పీకర్ కు అందజేశారు. తాజాగా అక్టోబర్ 24 నుంచి ఆ నలుగురిపై మళ్లీ విచారణను చేపట్టనున్నట్టు స్పీకర్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆ నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా అందాయి.
Party Defections Case:కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, అరికెపూడి గాంధీలను అక్టోబర్ 27న విచారించే అవకాశం ఉన్నది. ఈ మేరకు అక్టోబర్ 24 నుంచి 31వ తేదీ వరకు అసెంబ్లీ ఆవరణలో నిబంధనలను జారీ చేశారు. ఇతరులు ఎవరినీ అనుమతించవద్దని ఆదేశాలు జారీఅయ్యాయి. మొత్తం 8 మందిని ఈ నెలాఖరులోగా విచారణను పూర్తిచేసే అవకాశం ఉన్నది.