Parliament Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ డిసెంబర్ 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ నెల (నవంబర్) 30న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Parliament Sessions: డిసెంబర్ 1 నుంచి ఇదే నెల 19వ తేదీ వరకు ఈ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 15 సిట్టింగ్‌లు ఉంటాయని తెలిసింది. ఈ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే 12 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తంచేయనున్నాయి.
Parliament Sessions: ఇటు అధికార పక్షం, అటు విపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా వ్యూహాలను రచిస్తున్నది. దీంతో ఈ సమావేశాలు మాటల యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్నది.

