Parliament: పార్లమెంట్ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. గతంలో పలుమార్లు బయటి వ్యక్తులు అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించిన ఘటనలతో ఉలిక్కిపడిన భద్రతా దళాలు మరో భద్రతా వైఫల్యాన్ని పసిగట్టలేకపోయాయి. ఓ ఆగంతకుడు గోడ దూకి పార్లమెంట్ భవనం లోపలికి ప్రవేశించడాన్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేకపోవడం గమనార్హం.
Parliament: ఈ రోజు (ఆగస్టు 22) ఉదయం తెల్లవారుజామున 6.30 గంటలకు ఓ వ్యక్తి అనుమతి లేకుండా గోడ దూకి మరీ పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఆలస్యంగా గుర్తించి అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. ఎందుకు ప్రవేశించాడు? అతని చిరునామా ఏమిటి? ఎవరైనా పంపారా? భద్రతకు ఏమైనా ప్రమాదం పొంచి ఉన్నదా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

