Imane Khelif: పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత ఇమానె ఖెలిఫ్ ఆమె కాదు.. అతడే అంటూ ఈ అల్జీరియా బాక్సర్, లింగ వివాదానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ లీక్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఖెలిఫ్ శరీరంలో అంతర్గంతగా వృషణాలు, ఎక్స్‌వై క్రోమోజోములు ఉన్నట్లు తేలింది. పారిస్‌లోని క్రెమ్లిన్ బికెట్రే ఆసుపత్రి, అల్జీరియాకు చెందిన మొహమ్మద్ లామినే ఆసుపత్రికి సంబంధించిన వైద్య నిపుణులు ఇమానెకు సంబంధించి 2023 జూన్‌లో ఓ నివేదిక రూపొందించారు. ఇమానెలో అంతర్గతంగా వృషణాలు ఉన్నాయని, గర్భసంచి లేదని ఈ నివేదిక చెబుతోంది. ఇక ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఇతర జననాంగాలు సైతం ఉన్నట్లు ఉంది. దీంతో ఇమానె మహిళ కాదని, పురుషుడని నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆగస్టులో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఇటలీకి చెందిన బాక్సర్‌ను 66 కేజీల ప్రిక్వార్టర్స్‌లో 46 సెకన్లలోనే ఇమానె ఓడించింది. ఇమానె పంచ్‌లకు ప్రత్యర్థి బాక్సర్ ఒక్కపెట్టున ఏడ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి ఇమానెపై పడింది. ఆమెలో పురుష లక్షణాలు ఉన్నాయని పలు దేశాలకు ప్రతినిధులు విమర్శలకు దిగారు. ఈ పోటీల్లోకి ఎలా అనుమతించారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై విరుచుకుపడ్డారు.
Imane Khelif: 2023లో దిల్లీలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలుత లింగవివాదం తలెత్తెంది. ఇమానెను ఆట నుంచి మినహాయిస్తున్నట్లు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే ఐఓసీ మాత్రం ఇటీవల పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి యాంగ్ లియూను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఇమానెకు సంబంధించి వైద్య నివేదిక లీక్ కావడం, ఆమె మహిళ కాదని, పురుషుడని తేలిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇమానెపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఇమానె గోల్ మెడల్‌ను వెనక్కి తీసుకోవాలని మరో నెటిజన్ స్పష్టం చేసాడు.

