Paresh Rawal

Paresh Rawal: హేరా ఫేరీ 3లో పరేష్ రావల్ రీఎంట్రీ!

Paresh Rawal: బాలీవుడ్‌లో కామెడీ సినిమాల్లో ఐకానిక్ ఫ్రాంచైజీగా నిలిచిన ‘హేరా ఫేరీ 3’ నుంచి భారీ అప్‌డేట్! పరేష్ రావల్ తిరిగి బాబూరావ్ గణపత్‌రావ్ ఆప్టే పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా అక్షయ్ కుమార్‌తో వివాదం, చిత్రం నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్‌లో నిరాశ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా పరేష్ రావల్ వివాదం సమసిపోయిందని, ‘హేరా ఫేరీ 3’లో తాను తిరిగి చేరానని ధృవీకరించారు. “అంతా సెట్ అయ్యింది. ప్రేక్షకుల ప్రేమకు గౌరవం ఇస్తూ, మంచి సినిమాను అందిస్తాం” అని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టిలతో కలిసి మరోసారి హాస్యం పండించనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ ఏడాది చివర్లో షూటింగ్ ఆరంభం కానుంది. ఈ వార్తతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో ‘బాబూరావ్ బ్యాక్’ అంటూ హోరెత్తిస్తున్నారు. ఈ కామెడీ బొమ్మ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cycle vs Car: కేటీఆర్‌ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు గుదిబండగా మారాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *