TTD

TTD: తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం పలాస జీడిపప్పు!

TTD: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి విషయంలో ఇటీవల వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డులో వినియోగించే అన్ని పదార్ధాల క్వాలిటీ మీద శ్రద్ధ పెట్టింది టీటీడీ. ఇందుకోసం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమలలో లడ్డు అలాగే ఇతర ప్రసాదాల్లో వాడే జీడిపప్పును ఉత్తరాంధ్ర నుంచి సేకరించడం మొదలు పెట్టింది. టీటీడీ చరిత్రలో మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి జీడిపప్పును తిరుమల దేవస్థానానికి పంపించారు. అక్కడి ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రోడక్ట్స్ సంస్థకు జీడిపప్పు సరఫరా చేసేందుకు ఇటీవల టెండర్ ఖరారు చేశారు. దీంతో తొలివిడతగా 10 టన్నుల జీడిపప్పును సెప్టెంబర్ 26న టీటీడీకి పంపించారు. మొదటి విడత జీడిపప్పుతో వెళుతున్న వాహనానికి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీషలు  జెండా ఊపి పంపించారు. 

TTD: తిరుమల శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించడం కోసం పలాస నుంచి జేహెచ్‌ (బద్ద) రకం జీడిపప్పును పంపిస్తున్నట్లు ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. పలాస నుంచి జీడిపప్పును తీసుకువెళుతున్న లారీకి గరుడ వాహనం అని పేరు పెట్టారు. లారీని పూలతో అలంకరించి వేంకటేశుని ఫొటోకు పూజలు చేసి తరువాత లారీని పంపించారు. 

Also Read: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు

TTD: ‘తిరుమల తిరుపతి దేవస్థానంలో నాణ్యమైన, రుచికరమైన లడ్డూ తయారీకి అనుగుణంగా.. పలాస ప్రాంతం నుంచి సరఫరా చేయనున్న జీడిపప్పు వాహనాలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. మన ప్రాంతం జీడిపప్పు తిరుమల ప్రసాదంలో వాడడంపై మన ప్రాంత వాసిగా ఎంతో గర్వపడుతున్నాను’ అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

TTD: తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని టీటీడీ చెబుతోంది. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారంతో ఇప్పటికే కర్ణాటక నుంచి నందిని నెయ్యి ట్యాంకర్లను తీసుకువస్తున్నారు. ఇప్పుడు పలాస నుంచి నాణ్యమైన జీడిపప్పును కూడా పంపిస్తున్నారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *