IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 241 పరుగులు మాత్రమే చేయగా, టీం ఇండియా 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్‌లో, అక్కడి మీడియా చర్చల్లో అనేక ఆసక్తికరమైన ఆరోపణలు వెలువడ్డాయి. ఒక చర్చా కార్యక్రమంలో, టీం ఇండియా చేతబడి (Black Magic) ద్వారా గెలిచిందని వింత ఆరోపణలు వచ్చాయి. దుబాయ్ స్టేడియంలో భారతదేశం 22 మంది హిందూ పూజారులను పంపించి మైదానంలో మతపరమైన పూజలు చేయించిందని, ఇది పాకిస్తాన్ ఆటగాళ్ల దృష్టి మరల్చిందని పాకిస్తాన్ మీడియా సంస్థలు ప్రస్తావించాయి.
Also Read: Rachin Ravindra Record: కొత్త రికార్డులతో రచ్చ రచ్చ చేసిన రచిన్ రవీంద్ర..!
అంతేకాదు, పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడటానికి టీం ఇండియా నిరాకరించడానికి ఇదే అసలు కారణమని కొందరు వ్యాఖ్యానించారు. మ్యాచ్‌కు ముందు రోజు మైదానంలో ఏడుగురు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారని, దీని ప్రభావం మ్యాచ్‌పై పడిందని పాకిస్తాన్ మీడియా చర్చల్లో వినిపించింది.
ఇదే కాకుండా, భారత బౌలర్ల విజయాలకు ఐసీసీ ప్రత్యేక బంతులను అందిస్తోందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా ఆరోపించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అయితే వీటిని టీం ఇండియా అభిమానులు వ్యంగ్యంగా తీసుకుంటున్నారు.

