delhi: కవ్వింపు చర్యలకు దిగిన పాక్..

delhi: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు దేశాలు ఒకింత యుద్ధ వాతావరణంలోకి అడుగుపెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇటీవలే 450 కిలోమీటర్ల పరిధి కలిగిన ‘అబ్దాలి’ క్షిపణిని పరీక్షించిన పాక్, తాజాగా 120 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ‘ఫతహ్’ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.

ఈ ప్రయోగం ‘ఇండస్’ అనే సైనిక విన్యాసంలో భాగమని, ఇది కేవలం ట్రైనింగ్ లాంచ్ మాత్రమేనని పాక్ తెలిపింది. అయితే, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఈ ప్రయోగాన్ని భారత్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇది కేవలం శిక్షణ ప్రయోగం కాదని, యుద్ధ సన్నాహకాల్లో భాగంగా చేపట్టిన చర్యగా భారత్ భావిస్తోంది. ఈ అంశం ఇప్పుడు జాతీయ మీడియా, సోషల్ మీడియా వేదికలపై హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *