Padi Kaushik Reddy: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా 10కిపైగా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయన నిన్న సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు పార్టీల నడుమ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ తరుణంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లలో పాడి కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు 10కి పైగా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మోకిల, శంకర్‌పల్లి, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, కేశంపేట, మధురానగర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, చేవెళ్ల, కడ్తాల్ పోలీస్ స్టేషన్లలో 10కి పైగా చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఆయా పోలీస్‌స్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు.