Telangana: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని పలుచోట్ల శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షానికి వరి పొలాలు నేలకొరిగాయి. వరి పంట చేతికొచ్చే సమయంలో వరి మొత్తం బురదలో కూరుకుపోయింది. జిల్లా పరిధిలోని నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున వరిపొలాలు దెబ్బతిన్నాయి. వడ్లు పెద్ద మొత్తంలో రాలిపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు. దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
Telangana: మరో నెలరోజుల్లో వరి పంటచేతికొచ్చే సమయంలో నేలరాలిన పంటపొలాలను చూసి రైతులు బావురుమంటున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. మరోసారి వర్షం కురిస్తే మాత్రం వరి చేతికొచ్చే పరిస్థితులు ఉండవని ఆందోళన చెందుతున్నారు.