oscar 2025

Oscar 2025: ఆస్కార్ 2025కి అర్హత పొందిన ఇండియన్ షార్ట్ ఫిల్మ్!

Oscar 2025: లైవ్ యాక్షన్ కేటగిరిలో 2025 ఆస్కార్ అవార్డుల కోసం ఎంపికైంది ‘సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ షార్ట్ ఫిల్మ్. చిదానంద తెరకెక్కించిన ఈ సినిమా నిడివి 16 నిమిషాలు. కన్నడ జానపద కథ ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ‘ఎవరో తన కోడిని దొంగిలించటం. దాంతో కనపడకుండా పోయిన ఆ కోడి కోసం ఓ వృద్దురాలు పడే తపన’ ఈ షార్ట్ ఫిలిమ కథాంశం. ఇటీవల కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఈ మూవీ ఉత్తమ లఘుచిత్రం అవార్డ్ గెలుచుకుంది. దాదాపు 17 భాషాల చిత్రాలతో పోటీ పడి మరి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. బెంగుళూరులో జరిగిన షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ తొలి బహుమతి అందుకున్న ఈ షార్ట్ ఫిలిమ్ ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోనూ చోటు సంపాదిస్తుందని భావిస్తున్నారు. ఇక ఇండియా నుంచి కిరణ్ రావు సినిమా ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ కోసం ఎంపికైంది. ఈ సినిమా కూడా ఆస్కార్ అవార్డ్ లలో ఏ మేరకు పోటీ ఇస్తుందో చూద్దాం.

ఇది కూడా చదవండి: RRR: ‘ఆర్ఆర్ఆర్’కి అరుదైన గౌరవం!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *