Orange: ప్రేమికుల దినోత్సవం కానుకగా రామ్ చరణ్ కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం “ఆరెంజ్” మళ్ళీ రీరిలీజ్ కి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఈ సినిమా మళ్ళీ ఓ రేంజిలో మ్యాజిక్ చేసిందనే చెప్పాలి.లాస్ట్ టైం థియేటర్స్ లో ఏ రేంజిలో రెస్పాన్స్ అందుకుందో ఈసారి కూడా అదే రేంజిలో రెస్పాన్స్ అందుకుంది. ఫ్యాన్స్, థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే వసూళ్ల పరంగా కూడా ఆరెంజ్ సినిమా సాలిడ్ నంబర్స్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలా మొత్తానికి మళ్ళీ ఆరెంజ్ మళ్ళీ ఓ రేంజిలో దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, హరీష్ జైరాజ్ లైఫ్ టైం చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందించి ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ నిలబెట్టగలిగాడు.
