Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరుణంలో దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం గత అసెంబ్లీలో 24 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 22 మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు.
కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేల్లో 59 శాతం మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గత అసెంబ్లీలో ఇది 55 శాతం. ప్రస్తుత అసెంబ్లీలో 17 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు పూర్తి చేశారు. అయితే గత అసెంబ్లీలో కేవలం 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 15 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: యూపీలోని సంభాల్ లో హింస.. ముగ్గురు యువకుల మృతి
Maharashtra: ప్రస్తుత అసెంబ్లీలో 40 శాతం మంది 56-70 ఏళ్ల మధ్య వయస్కులే. మునుపటి అసెంబ్లీలో, అటువంటి వయస్సు వారు 34 శాతం మాత్రమే. ఈ ఎన్నికల్లో 25-40 మధ్య వయసున్న వారిలో ఎనిమిది శాతం మంది విజయం సాధించారు. కానీ 2019లో 14 శాతం, 2014లో 20 శాతం గెలిచారు.
కొత్త ఎమ్మెల్యేల్లో నాలుగో వంతు మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా ప్రకటించారు. 86 శాతం మంది వ్యవసాయం,వ్యాపారాన్ని తమ వృత్తిగా చెప్పారు.