TGSRTC Jobs 2025: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగాలకు భారీగా ఖాళీలు నింపేందుకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డ్రైవర్ పోస్టులు 1,000 కాగా, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి.
దరఖాస్తు తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ విండో అక్టోబర్ 8, 2025 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 28, 2025 వరకు కొనసాగుతుంది.
అర్హతలు
శ్రామిక్ పోస్టులకు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ తప్పనిసరి.
డ్రైవర్ పోస్టులకు:
కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
సరైన డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి.
వయోపరిమితి (జూలై 1, 2025 నాటికి)
డ్రైవర్ పోస్టులకు: 22 – 35 సంవత్సరాలు
శ్రామిక్ పోస్టులకు: 18 – 30 సంవత్సరాలు
ఇది కూడా చదవండి: Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు 9: మూడో వారం ఎలిమినేషన్ – ప్రియా శెట్టి ఔట్!
రిజర్వేషన్ వయో సడలింపు:
SC, ST, BC, EWS అభ్యర్థులకు: 5 ఏళ్లు
మాజీ సైనికులకు: 3 ఏళ్లు
ఎంపిక విధానం
ఈ భర్తీలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ఎంపికను ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), మెడికల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ (డ్రైవర్ పోస్టులకు మాత్రమే) ఆధారంగా చేపడతారు.
దరఖాస్తు ఫీజు – డ్రైవర్ పోస్టులు:
జనరల్ అభ్యర్థులు: ₹600
SC/ST అభ్యర్థులు: ₹300
శ్రామిక్ పోస్టులు:
జనరల్ అభ్యర్థులు: ₹400
SC/ST అభ్యర్థులు: ₹200
జీతభత్యాలు
డ్రైవర్ పోస్టులు: నెలకు ₹20,960 – ₹60,080
శ్రామిక్ పోస్టులు: నెలకు ₹16,550 – ₹45,030
👉 తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది మంచి అవకాశం. నిర్దిష్ట అర్హతలు ఉన్న అభ్యర్థులు గడువు ముగియకముందే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.