Ongole Gitta

Ongole Gitta: పౌరుషానికి మారుపేరు ఒంగోలు గిత్త..

Ongole Gitta: బలంగా దృఢంగా కండ పట్టి ఉండే శరీర సౌష్టవం పొట్టిగా గట్టిగా ఉండే కొమ్ములు ఎత్తైన మోపురం వేలాడే గంగడోలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఒంగోలు గిత్త రైతు ఇంటి ముందు ఉంటే అదో రాజసం ఎంతటి బరువైన అవలీలగా లాగే తత్వం లోతుగా దుఃఖి చేసేందుకు కిలోల కొద్ది బరువు పెట్టిన ఇట్టే దున్న గలిగే శక్తి బండి కడితే గంటకు కనీసం 30 మైళ్ళు పరుగు తీయగలిగే సామర్థ్యం కయ్యానికి కాలు దువ్వితే వెనకడుగు వేయని నైజం ఇవి ఒంగోలు గిత్తలకు ఉండే గొప్ప లక్షణాలు అంతరించిపోతున్న ఒంగోలు గిత్తల జాతిపై మహా న్యూస్ ప్రత్యేక కథనం.

ఎద్దు అనగానే ముందుగా గుర్తు వచ్చేది ఒంగోలు గిత్త ఆ సొగసు చూసేందుకు రెండు కళ్ళు చాలవు పర్వత శిఖరాన్ని ధిక్కరించే విధంగా ఉండే మోపురం లైబద్ధంగా కదిలే గంగడోలు కొనలు తెరిచిన కోసకొమ్ములు కొండల నైనా పెకిలించే బలం ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంగా కదిలి వస్తుంటే నడకలో రాజసం నడతలో అమృత కాలుదవ్వి రంకెలేసిందో గుండెల్లో గోబెల్మనాల్సిందే కొదమసింహానినైనా క్షణాలలో మట్టికరిపించే కండబలం పుట్టుకలోనే పుట్టుకొచ్చిన పౌరుషం ఈ ఉపమానాల కలయికే మన ఒంగోలు గిత్త తెలుగు నేల ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింప చేసిన ఈ జగత్జత ఇప్పుడు ప్రమాదంలో పడింది గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ఈ జాతి అంతరించిపోతుంది.

పరమశివుని వాహనం నందీశ్వరుని పోలి ఉండే ఆహర్యం ఎత్తైనమోపురం చూడముచ్చటైన రూపంలో అలరించే ఒంగోలు జాతి పశువులు అంతరించిపోతున్నాయి రాజసం ఉట్టిపడే ఆ వృషభానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ వ్యవసాయంలో యాంత్రికరణ పెరగడంతో పశువులపై రైతుల ఆసక్తి తగ్గిపోయింది ఒకప్పుడు ప్రతి రైతు ఇంటి ముందు కనిపించే పశు జాతి లో భాగమైన ఒంగోలు జాతి ఇప్పుడు అదృశ్యం అవుతుంది ఒంగోలు గిత్తలు అంటే రాజసానికి మారుపేరు బలిష్టమైన శరీరంతో కొండలను సైతం ఢీకొట్టగల సత్తా ఉన్న జాతి ఇది, శతాబ్దాల చరిత్ర గల ఒంగోలు జాతి పశువుల ప్రత్యేకత ఒంగోలు జాతి గిత్తల రాజసానికి మరో పేరు మనదేశంలో పశు సంపదలో ఒంగోలు జాతి గిత్తలకు విశిష్ట స్థానం ఉంది. ఇతర అన్ని జాతుల కన్నా ఈ జాతి బలిష్టంగా ఉంటుంది ఒంగోలు జాతి ఎద్దులు ఎంతటి బరువైన అలవోకగా మోయడంతోపాటు సేద్యానికి బాగా ఉపకరిస్తాయి అందువల్ల మెట్ట భూములు అధికంగా ఉండే జిల్లా వ్యవసాయానికి ఈ జాతి ఎద్దులను ఉపయోగిస్తారు శతాబ్దం క్రితమే దేశ విదేశాలలో ఈ జాతి ప్రత్యేకతలు పొందింది.

ALSO READ  Duvada Srinivas: MLC అయితే నాకేంటి..నాతో పెట్టుకోకు జాగ్రత్త

ఒంగోలు గిత్త ఇది అరుదైన పశు జాతి ఒకప్పుడు ప్రతి ఇంట సంతతి ఉండేది గ్రామాలలో మందల మందలుగా ఉండేవి, ఎప్పుడైతే వ్యవసాయంలో యాంత్రికరణ వచ్చిందో అప్పుడు పశు సంపదకు దుర్ధినాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు గ్రామాలలో ఎక్కడ కూడా ఒంగోలు పశు జాతి కనిపించని పరిస్థితి కేవలం బండలాగుడు పోటీలకు ఉపయోగించే ఎద్దులు మాత్రమే ఈ సంతతికి చెందినవిగా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Ajith Kumar: అభిమానులకు అజిత్ పొంగల్ గిఫ్ట్..

Ongole Gitta: దేశంలో ఎక్కడ ఎడ్ల పోటీలు జరిగిన మొదటి బహుమతి ఒంగోలు జాతి ఎడ్లదే ఒంగోలు జాతి ఎడ్లకు ఎంతో చరిత్ర ఉంది దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి హర్యానా మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రకాశం జిల్లా కు వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది తమతోపాటు కొంత పశు సంపదను కూడా తీసుకొచ్చారు అలా వచ్చిన పశు సంపద ఒంగోలు జాతి ఎడ్ల పేరుతో ఫేమస్ అయ్యాయి ఒంగోలు జాతి ఎడ్లు హుందాగా రాజసం ఉట్టిపడేలా ఉంటాయి ప్రపంచంలోనే ఫేమస్ ఒంగోలు గిత్తలే, దుక్కి దున్నడంలోనూ కష్టసాధ్యమైన పని చేయడంలోను ఒంగోలు గిత్త ఎంతో అనువైనది ఒంగోలు జాతి పశువులు ఆకారంలో ఎంతో పెద్దగాను ఎంతో బలిష్టంగాను విలక్షణం గా చూడగానే గుర్తుపట్టేలాగా ఉంటాయి ఒంగోలు గిత్త కు మరో ప్రామాణికమైన అంశం దాని అందమైన మోపురం మోపురం పెద్దదిగా ఉండి నడిచేటప్పుడు అటు ఇటుగా ఒరుగుతూ ఎంతో అందంగా ఉంటుంది ఒంగోలు జాతి గిత్త బరువు సుమారు 500 కిలోల పైగా ఎత్తు1.5 మీటర్లుగా పొడవు.1.6 మీటర్లుగా చుట్టుకొలత దాదాపు రెండు మీటర్ల గా ఉంటాయి.

ఒంగోలు జాతి ఎద్దులను గుర్తుపట్టాలి అంటే ఎత్తు గర్వం గంగుడోలు మోపురం కళ్ల దగ్గర నల్లపు స్థంభం లాంటి కాళ్లు ఇవన్నీ ఒంగోలు జాతి ఎద్దులలో కనిపిస్తాయి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాందునే ఒంగోలు జాతి ఎద్దులకు ప్రపంచ పశు సంపదలో పేరు వచ్చింది మన రాష్ట్రంలో ఒంగోలు జాతి ఎద్దుగా చెప్పుకునే ఎద్దు ధర దాదాపు 20 లక్షలు ఉంటుంది ఒంగోలు జాతి ఎద్దులకు ఉన్న బ్రాండ్ దృష్ట్యా వ్యాపారులు కృత్తిమ కర్బదారణ పద్ధతి ద్వారా అన్ని రకాల ఆవులకు వీర్యం ఎక్కిస్తున్నారు ఒంగోలు జాతి ఎద్దులను భవిష్యత్తు తరాలకు అందించడానికి జిల్లాలోని చీమకుర్తి మండలం రామతీర్థం లో 1990 లో పశు క్షేత్రాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది తరువాత ఈ మండలంలో గెలాక్సీ గ్రానైట్స్ ఉన్నాయని విశాఖ తో అప్పటి ప్రభుత్వం 2001 ఏప్రిల్ నెలలో నాగులుప్పలపాడు లో ఈ పశువుల క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు ఈ పశుక్షేత్రంలో సుమారు 300కు పైగా ఒంగోలు జాతి పశువులు ఉన్నాయి.

ALSO READ  చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.. చర్చించనున్నా కీలక అంశాలివే..

ఆధునిక యంత్రాలు వచ్చి పశువులతో వ్యవసాయం చేసే పద్ధతులను మొరటిగా మార్చాయి ఒకప్పుడు దూకి దున్నాలి అంటే పశువులకు కాడి కట్టాల్సిందే ఇప్పుడు ఆ స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి పంటలు సాగు చేయడానికి ఒకటి రెండు పెద్దలు ఉంటే చాలు అనే పద్ధతి కొంతకాలం క్రితం ఉండేది ఇప్పుడు దాన్ని కూడా అధిగమించే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి కరువు కాలం పశుగ్రాసం కొరత వల్ల పశువులను గ్రామాలు దాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది

శారీరిక బలం సామర్థ్యాలకు దీనికి మించినది లేదు పట్టుదలకు పెట్టింది పేరు.

Ongole Gitta: అంద చందాలకు దీనికి లేదు సాటి ఆప్యాయత అనురాగాలు పంచడంలో దానికి అదే మేటి ఉల్లాస ఉత్సాహాలు దీని సొంతం యజమానికి మేలు చేయడమే దీని జీవన సూత్రం ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగు వారికి ఇది ఆత్మబంధువు అదే ఒంగోలు గిత్త..ఒంగోలు గిత్త పేరు వినగానే మన కళ్ళముందే ఏతైనా మోపురం తో పెద్ద గంగడోలు తో సౌందర్యం తో ఒక నిండైన విగ్రహం మన కళ్ళ ముందు కనబడుతుంది ఇంటి చంటి బిడ్డ తన రొమ్ము చీకిన గంగుడోలుతో ఆడుకున్న మురిపంతో చూసే ప్రేమ తత్వానికి ప్రతీక ఒంగోలు జాతి ఆవు అయితే కాలం చెల్లితే దిగులతో ఆహారం స్వీకరించకుండా త్యాగం చేసే విశ్వాసం ఒంగోలు జాతి గిత్తకి ఉంటుంది ఒంగోలు జాతి పశుసంతతి ఎంతసేపు చూసినా తనివి తీరదు..

అయితే ప్రస్తుతం ఈ జాతి క్షణ దశలో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో యజమానులు తమ బిడ్డల కన్నా మిన్నగా వాటి పట్ల శ్రద్ధ వహించడం వలన ఈ జాతి పశువులు ఇంకా మిగిలి ఉన్నాయి సంక్రాంతి సందర్భంగా బండలాగుడు పోటీలలో ఒంగోలు జాతి ఎడ్లదే ప్రథమ స్థానం ఈ జాతి ఎడ్లను ఓడించగలిగిన సామర్థ్యం ఈ భూ ప్రపంచంలోనే లేదు. పాడి పెంపకం రోజురోజుకి భారంగా మారడంతో ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందేమో అని రైతులు ఆశిస్తున్నారు పాడి గేదెలను పెంచడానికి బ్యాంకులు రుణాలు ఇస్తున్నట్లు ఒంగోలు జాతికితులను పెంచడానికి బ్యాంకులో రుణాలు ఇవ్వాలని రైతుల కోరుకుంటున్నారు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒంగోలు జాతి గిత్తలను సంరక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *