Chhattisgarh: బస్తర్ డివిజన్లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు మళ్లీ తన దాడి తీరును చూపించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఒక భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, భోపాల్పట్టణం పరిధిలోని ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం సమీపంలో DRG సిబ్బంది నక్సల్ వ్యతిరేక కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో వారు ఉల్లూర్ లోయ గుండా కాలినడకన ముందుకు కదులుతుండగా, మావోయిస్టులు ముందుగా అమర్చిన ప్రెజర్-యాక్టివేటెడ్ IEDపై అడుగుపెట్టడంతో భీకరమైన పేలుడు సంభవించింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
ఈ పేలుడులో ఒక జవాను అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే తరలించగా, చికిత్సకు తీసుకెళ్తున్న సమయంలో ఆయన కూడా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గాయపడిన మిగతా సిబ్బందికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం వైద్య చికిత్స అందుతున్నట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించి, మావోయిస్టుల కదలికల కోసం విస్తృతంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

