OG: ‘ఓజి’ సినిమా ప్రేక్షకులను మరింత ఉత్తేజపరుస్తోంది. దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రూపొందించి, పవర్ స్టార్ కు మరో కొత్త డైమెన్షన్ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్‌లో సాగుతోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. తాజాగా మేకర్స్ ఒక స్పెషల్ ట్రీట్ రిలీజ్ చేశారు. అదెంతగానో ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Mirai Twitter Review: మిరాయ్ ట్విట్టర్ టాక్.. తేజ సజ్జాకు మరో బ్లాక్ బస్టర్?
ఓజి గ్లింప్స్ తర్వాత ఇమ్రాన్ హష్మీ ఓమి పాత్రకు సంబంధించిన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ థీమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో ఓమి అనే విలన్‌గా ఇమ్రాన్ ఎలాంటి డెడ్లీ క్రైమ్ లార్డ్‌గా ఉంటాడో క్లియర్‌గా చూపించారు. ‘విధ్వంసానికి మరో పేరు ఓమి’ అనే లైన్‌తో పాట ఓపెన్ అవుతూ, పవన్ కళ్యాణ్ గంభీర చరిత్రతో ఓమి మధ్య ఫైట్ ఫ్లాష్ చూపిస్తుంది. థమన్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ బూమింగ్ బీట్స్, ఇంటెన్స్ రిథమ్స్‌తో థ్రిల్ చేస్తుంది. డైరెక్టర్ సుజిత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.