OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ అవుతోంది. ఇప్పుడు మరోసారి థియేటర్లలో స్పెషల్ షోలు రానున్నాయి. 50వ రోజు సందర్భంగా నవంబర్ 13న తెలుగు రాష్ట్రాల్లో ఈ షోలు పడతాయట. దీంతో అభిమానులకు ఘనమైన ట్రీట్ ఎదురవుతుంది.
Also Read: Devara-2: ‘దేవర-2’ కోసం కొరటాల కసరత్తు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘ఓజీ’. అభిమానుల అంచనాలకు తగ్గట్టు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతుంది. డైలీ డోస్‌గా ‘ఓజీ’ హవా కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి థియేటర్లలో స్పెషల్ షోలకు సిద్ధమవుతోంది. మొన్న ఓటీటీ రిలీజ్ ముందు అభిమానులు కొన్ని థియేటర్లలో స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. ఇప్పుడు 50వ రోజు సందర్భంగా నవంబర్ 13న తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు పడనున్నాయి. దీంతో ‘ఓజీ’ ఫ్యాన్స్‌కు థియేటర్లలో సాలిడ్ ట్రీట్ లభిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం వహించింది. ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపు 300 కోట్లు దాకా వసూళ్లు రాబట్టి పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

