NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ బ్లాక్‌బస్టర్ తర్వాత తన నెక్స్ట్ చిత్రాలను ఇప్పటికే లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ‘వార్-2’లో కూడా తారక్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తన 31వ చిత్రాన్ని లాక్ చేశాడు తారక్.
ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కానీ, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌పై సినీ వర్గాల్లో తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Khammam: ఖమ్మంలో దారుణం – వాట్సాప్ చాటింగ్ కారణంగా విద్యార్థి ఆత్మహత్య
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారట. ఇక ఈ చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్ మరికొద్ది రోజుల్లో జాయిన్ కాబోతున్నట్లు చిత్ర వర్గాల నుంచి తెలుస్తుంది.
Full Video: Fear Song:

