NLR TDP DOWN YCP RISE

NLR TDP DOWN YCP RISE: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డేంజర్‌ బెల్స్‌!

NLR TDP DOWN YCP RISE: జగన్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. కుల బలం, ఆర్దిక బలంతో రాజకీయం చేసే లీడర్లు అంతా జగన్ వెంటే కనిపిస్తారు ఈ జిల్లాలో. పవర్ పోయి, బలం జీరోకు పడిపోయినా కూడా… మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్ రెడ్డి వంటి లీడర్లు చాలా బలంగా వైసీపీ కోసం పని చేస్తూ, పోరాటలకు దిగుతున్నారు. విచిత్రం ఏంటంటే… వీరందరిపై రకరకాల కేసుల నమోదుకు, విచారణకు శరవేంగంగా అడుగులు పడుతున్నాయంటూ… త్వరలోనే అరెస్టులు సైతం ఉంటాయంటూ హంగామా నడుస్తోంది. వైసీపీ హయాంలో చేపట్టిన స్కీమ్‌లలో జరిగిన స్కాములపై నెల్లూరు వైసీపీ లీడర్లని పక్కా సాక్షాధారాలతో జైళ్లకు పంపే విషయంలో.. నెల్లూరు జిల్లాకు చెందిన ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కొంత సక్సెస్ అయినట్టు కూడా సమాచారం అందుతోంది. కానీ వైసీపీ నేతల్లో జోష్‌ చూస్తుంటే మాత్రం పరిస్థితి వేరేలా కనబడుతోంది.

గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మినిమం మూడేళ్లు టీడీపీ నేతలు కనీసం రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సీన్‌లు ఎక్కడా కనిపించలేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్‌లు తమ రెక్కల కష్టంతో, అవమానాలు, అరెస్టులు ఎదుర్కొని టీడీపీని అధికారంలోకి తేవడానికి ఐదేళ్లు నానా తంటాలు పడితే, నెల్లూరు టీడీపీలో చాల మంది టాప్ లీడర్లు.. ఓన్లీ యాక్షన్ చేస్తూ, టైమ్ పాస్ చేశారని విమర్సలు కూడా ఉన్నాయి. మరోవైపు వైసీపీ అధికారం కోల్పోయిన తొమ్మిది నెలల్లోనే నెల్లూరు వైసీపీ లీడర్లు తిరిగి ఫైటింగ్ మోడ్‌లోకి వచ్చి, టీడీపీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నా కూడా అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు… మైన్‌లు, కాంట్రాక్టులు, ఇసుక యాపారాలు అంటూ బిజీగా మారిపోయారని జిల్లాలో టీడీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారట.

NLR TDP DOWN YCP RISE: కూటమి అధికారంలోకి వచ్చిన గత తొమ్మిది నెలల్లో… వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.. పెద్ద నోరేసుకుని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడని రోజు లేదట. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ అయితే… రోడ్డెక్కకుండానే తెరవెనుక పాలిటిక్స్ చేస్తూ, నెల్లూరు సిటితో పాటూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో… జగన్ అండ్ బ్యాచ్ డైహర్డ్ ఫ్యాన్స్‌ని కాపాడుకునే పనిని ప్రణాళిక బద్దంగా చేస్తున్నారట. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు అయితే తమ స్టయిలే వేరన్నట్లు.. తమ తమ నియోజకవర్గాల్లో టీడీపీ లీడర్స్ చేతనే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, విమర్సలు చేయిస్తున్నా కూడా తిప్పికొట్టే నాధుడు కరువయ్యాడంటూ తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట.

ALSO READ  Banana Prices: పేదోడికి అందనంత దూరంలో అరటి పండు రేట్లు..

కావలి, సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్ రెడ్డిలను బలహీనపరిచి, ఆధారలతో సహా వారి అవినీతిని బట్టబయలు చేస్తే తప్పించి.. తెలుగుదేశం పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో మైలేజ్ వచ్చే పరిస్దితి కనిపించడం లేదు. కానీ ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పని ఎందుకు చేయడం లేదోనని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ టాక్‌ వినిపిస్తోంది. ఇక తెల్లరాయి, సిలికా, ఇసుక మైనింగ్‌ వంటి అవినీతి వ్యవహాలను నేరుగా లోకేష్‌కు, ఆయన సన్నిహితులకు అంటగడుతూ… వైసీపీ నేతలు కొన్ని పత్రికల్లో విషపు రాతలు రాయిస్తున్నా కూడా కనీసం కౌంటర్ ఇచ్చే పరిస్థితి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో లేకపోవడం చూస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. ఇదంతా చూసి… చంద్రబాబు, లోకేష్‌ల దయాదాక్షిణ్యాలతో టికెట్లు, ఎన్నికల ఖర్చుకు డబ్బు సంచులు తెచ్చుకున్న.. ఇప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో చాల మందికి… అసలు విశ్వాసం, విధేయత అనేదే లేదా అని టీడీపీ క్యాడర్ ఆగ్రహావేశాలతో ఉందట.

Also Read: Janasena Jayakethanam: 7 సిద్ధాంతాలతో పుట్టిన పార్టీ..11ఏళ్ల జర్నీ

NLR TDP DOWN YCP RISE: నెల్లూరు జిల్లాలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక లీడర్ల నిస్తేజం, నిర్లక్ష్యం కారణంగా ఓట్లేసిన జనాల్లో కూడా అసంతృప్తి అప్పుడే మొదలైందని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవల వైసీపీ నెల్లూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమానికి వేల సంఖ్యలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి వైసీపీ నాయకులు, క్యాడర్ తరలివచ్చారు. నెల్లూరు ట్రంక్ రోడ్డులో భారీ బల ప్రదర్సన చేసి నెల్లూరు కలెక్టరేట్ ముందు బులుగు బ్యాచ్ నానా హంగామా చేసింది. పవర్‌లో లేకున్నా ఇంత మంది వైసీపీ క్యాడర్ రోడ్లపైకి రావడంపై నెల్లూరు జనాలు కూడా ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి.

ప్రయివేటు కాలేజీల విద్యార్దులను ఫీజు బాకాయిల కోసం వేధించకుండా మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు. హల్ టికెట్స్, సర్టిఫికెట్స్ ఇవ్వకుండా యువతని ఇబ్బంది పెట్టే కాలేజీలపై లోకేష్ సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇంత చేస్తున్నాకూడా యువత పోరు పేరుతో వైసీపీ లీడర్స్ తీవ్ర స్దాయిలో విమర్సలు చేస్తు, ప్రదర్సన చేశారు. ఫీజు పోరు పేరిట ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ.. ప్రత్యర్థి పార్టీ రోడ్డెక్కి బల ప్రదర్శనలు చేస్తోంటే.

జిల్లాలోని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేందుకు కానీ, వైసీపీపై కౌంటర్‌ అటాక్‌కి కానీ ప్రయత్నం చేయకుండా.. ఎందుకిలా నిమ్మకి నీరెత్తినట్లు ఉంటున్నారో పాలుపోవట్లేదని సైకిల్‌ పార్టీ అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫ్యాన్‌ పార్టీ చచ్చిన పామని పొరబడితే సైకిల్‌కి ముప్పు తప్పదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కాలనాగులా పైకిలేచి బుసలు కొట్టేందుకు ఎంతో సమయం పట్టదని పరిశీలకులు సైతం హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి. ఇకనైనా నెల్లూరు జిల్లా అధికార పార్టీ నేతలు అలర్ట్‌ అవుతారో లేదో.

ALSO READ  Dowry Harassment: 100 సావర్ల బంగారం, 70 లక్షల కారు కొనిచ్చిన మళ్లీ వరకట్న వేధింపులు.. మహిళ మృతి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *