Thammudu: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన “తమ్ముడు” సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఓటీటీలో మాత్రం సందడి చేసేందుకు సిద్ధమైంది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా, సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా, హిందీ మినహా అన్ని ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

