Niharika Konidela

Niharika Konidela: ఆ నొప్పి నాకు మాత్రమే తెలుసు.. విడాకులపై స్పందించిన నిహారిక

Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చైతన్య జొన్నలగడ్డతో జరిగిన ఆమె పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిగిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల కారణాలు ఎప్పటికీ బయటకు రాలేదు. అయితే నిహారిక మాత్రం ఆ కష్టాల నుంచి బయటపడి తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే ప్రయత్నం చేస్తోంది.

విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విడాకుల గురించి నిహారిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “అందరూ నాది ప్రేమ వివాహం అనుకుంటున్నారు. కానీ అసలు నిజం ఎవరికీ తెలియదు. ఎందుకు విడాకులు తీసుకున్నానో అది నా వ్యక్తిగత జీవితం. నాకు తగిలిన దెబ్బకు నొప్పి నాకు మాత్రమే తెలుసు. ఇతరులకు కాదు” అని ఆమె చెప్పింది.

నాన్న ఇచ్చిన అండ – నిహారిక ఎమోషనల్

విడాకుల సమయంలో తనకు కుటుంబం ఇచ్చిన మద్దతు గురించి కూడా నిహారిక ప్రస్తావించింది. “మా నాన్న ఎప్పుడూ నన్ను భారం అనుకోలేదు. ఒక బాధ్యతగా చూసుకున్నారు. ఆయన వయసు 65 అయినా ఆలోచన మాత్రం ఈ జనరేషన్‌ది. ‘నీకు 60 ఏళ్లు వచ్చినా నేను చూసుకుంటాను, వచ్చెయ్ మన ఇంటికి’ అని నన్ను ధైర్యం చెప్పారు. మా అన్నయ్య వరుణ్ తేజ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి” అని ఆమె భావోద్వేగంతో చెప్పింది.

ఇది కూడా చదవండి: Telangana News: ఉమ్మ‌డి జిల్లాల‌కు వీరే ప్ర‌త్యేక అధికారులు

హీరోయిన్‌ నుంచి నిర్మాత వరకు – నిహారిక జర్నీ

హీరోయిన్‌గా కెరీర్‌లో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన నిహారిక, ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారింది. తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా సూపర్ హిట్ అయింది. దీనికిగాను ఆమెకు బెస్ట్ ప్రొడ్యూసర్‌గా ‘గద్దర్ అవార్డు’ కూడా దక్కింది.

ఫ్యాన్స్ స్పందన

నిహారిక చెప్పిన మాటలు విని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. “నువ్వు బలంగా ముందుకు వెళ్తున్నావు కానీ నీ నాన్న లోపల ఎంత బాధపడుతున్నారో ఆయనకే తెలుసు” అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి విడాకుల తర్వాత నిహారిక తన కుటుంబం అండతో బలంగా నిలబడుతూ, కెరీర్‌లో కొత్త దారులు వెతుక్కుంటూ ముందుకు సాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *