Hyderabad: తెలంగాణ మెట్రో రైలు ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్వీఎస్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయనకు అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సలహాదారుగా రెండు సంవత్సరాల కాలపరిమితి గల పదవీ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుండి రిలీవ్ చేసి, పట్టణ రవాణా రంగంలో తన అనుభవాన్ని వినియోగించుకోవడానికి సలహాదారుగా నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇక, ఆయన స్థానంలో ప్రస్తుతం హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ ఇకపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌తో పాటు మెట్రో ఎండీగా కూడా కొనసాగనున్నారు.