Nepal: నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. దేశ సైన్యం సూచనల మేరకు ఆయన తప్పుకున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి ఆరోపణలు నేపాల్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీశాయి. నిన్నటి నుంచి నిరసనలు మరింత హింసాత్మకంగా మారాయి. పార్లమెంట్ ముట్టడితో పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా, 20 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.
ప్రజలు నిరసనల్లో తీవ్రంగా కేపీ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, హోంమంత్రి రాజీనామా చేసినా ఉద్యమాలు ఆగలేదు. చివరికి ఒత్తిడిని తట్టుకోలేక కేపీ ఓలి తప్పుకోవాల్సి వచ్చింది.
రాజీనామా చేసిన వెంటనే సైన్యం ఆయనను రహస్య ప్రాంతానికి తరలించింది. ఈ సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని రేసులో ఎవరు ముందున్నారు? అనే ఉత్కంఠ నేపాల్ రాజకీయ వర్గాల్లో పెరిగిపోతోంది.

