Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమా నుంచి సంచలన వార్త. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు నయనతార 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. నయనతారకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉండటంతో నిర్మాతలు ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న మేకర్స్, నయనతారను ఫైనల్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కాస్త రెమ్యూనరేషన్ అటూ ఇటూ అయినా, ఆమెతోనే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: Sumanth-Keerthi Reddy: మళ్ళీ పెళ్లి.. సుమంత్-కీర్తి రెడ్డి మళ్లీ ఒక్కటవుతున్నారా?
Nayanthara: ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, అలాగే చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని టాక్.