Nayanthara: లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన ఈ హీరోయిన్ ఇప్పటికీ అదే క్రేజ్‌ను కొనసాగిస్తోంది.
సినిమా కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్న నయనతార, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగానే సమతూకం చేసుకుంటోంది. మూడు సంవత్సరాల క్రితం కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న నయనతార.. సరోగసి ద్వారా ఇద్దరు మగ కవలలకు తల్లి కూడా అయ్యింది.
అయితే ఇటీవల నయనతార విడాకులు తీసుకోబోతోందని వార్తలు హడావుడి చేశాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘పెళ్లి నరకం’ అనే పోస్టు పెట్టడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ పోస్ట్ తొలగించినా, స్క్రీన్‌షాట్‌లు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఓ రకమైన గాసిప్ మొదలైంది.
ఇది కూడా చదవండి: Samantha: తానా 24వ మహాసభల్లో.. ఏడ్చేసిన సమంత.. కన్నీళ్లతోనే స్పీచ్ ఇచ్చిన సామ్
ఈ వార్తలకు నయనతార దంపతులు తగిన సమాధానం ఇచ్చారు. తాజాగా నయనతార తన భర్త విఘ్నేష్, పిల్లలతో కలిసి పళని స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ వీరు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. దీంతో విడాకుల వార్తలకు బ్రేక్ పడింది.
ప్రస్తుతం నయనతార తన సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మెగా 157’ సినిమాలో నటిస్తోంది. అలాగే, ‘అమ్మోరు తల్లి 2’ సినిమా షూటింగ్‌లో కూడా బిజీగా ఉంది. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్నాడు.
మొత్తం చెప్పాలంటే..
నయనతార కెరీర్ గానీ, వ్యక్తిగత జీవితం గానీ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె జీవితంలో ఎలాంటి గందరగోళాలు లేవని, కుటుంబంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పకనే చెప్పింది.