Ponnam Prabhakar: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తొలిరోజే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై లేఖ రాసిన రామచందర్‌రావుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. రామచందర్‌రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు. రామచందర్‌రావు రాసిన లేఖ నవ్వు తెప్పిస్తున్నదని తేలికగా తీసిపారేశారు.
Ponnam Prabhakar: సీఎం రేవంత్‌రెడ్డికి రామచందర్‌రావు లేఖ రాయడం విడ్డూరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ మెగా ఫెయిల్యూర్స్ అంటూ తీవ్రంగా విమర్శించారు. రామచందర్‌రావు లేఖ గురువింద గింజ సామెతను గుర్తు చేసేలా ఉన్నదని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రూపాయి తేని బీజేపీ నాయకులు లేఖలు రాయడం విడ్డూరమని ఆరోపించారు.
Ponnam Prabhakar: 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు దేశ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను విస్మరించలేదా అని ప్రశ్నించారు. వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని ఆరోపించారు.
Ponnam Prabhakar: లీటర్ పెట్రోల్ ధరను 70 రూపాయల నుంచి 110 రూపాయలకు పెంచింది బీజేపీ సర్కారు కాదా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్న మోదీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఏమైందని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఫల్యాలను రాస్తే రామాయణమంత, వింటే భారతమంత ఉంటాయని ఎద్దేవా చేశారు.