Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మానవత్వం మరోసారి చాటుకున్నారు. రాజమండ్రి రూరల్‌కి చెందిన టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉండటంతో, స్వయంగా వీడియో కాల్ చేసి అతన్ని పరామర్శించారు.
చిన్నప్పటి నుంచే ఆకుల కృష్ణకు తెలుగుదేశం పార్టీపై మంచి అభిమానం ఉంది. ప్రతి ఎన్నికలో పార్టీకి పని చేసి, జెండాలు ఎగురవేసి, పార్టీ కోసం కృషి చేశారు. ముఖ్యంగా చంద్రబాబుపై ఆయనకున్న అభిమానానికి హద్దులే లేవు. కానీ ఇటీవల క్యాన్సర్ బారిన పడి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. తన ఆరోగ్యం మరింత దిగజారుతుండటంతో… జీవితంలో ఒక్కసారైనా తన ఇష్టనాయకుడు చంద్రబాబుతో మాట్లాడాలని ఆశపడ్డాడు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’.. మీకు హేట్సాఫ్
ఈ విషయం సీఎం చంద్రబాబుకు చేరడంతో, ఆయన్ను వెంటనే వీడియో కాల్ చేశారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. “ధైర్యంగా ఉండండి కృష్ణా… మీ వెనుక నేను, మా పార్టీ ఉందాం… మీ కుటుంబానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది” అంటూ భరోసా కల్పించారు.
అనారోగ్యంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న కృష్ణ, తన ఇష్టనాయకుడు చంద్రబాబు ఫోన్ చేసినందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తన కోరిక నెరవేరినందుకు కృష్ణ ఎంతో సంతోషంగా ఉన్నాడు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.
చంద్రబాబును చూడాలన్న ఆకుల కృష్ణ కోరిక మేరకు వీడియో కాల్లో కృష్ణతో సీఎం మాట్లాడారు.రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచీ టీడీపీ అభిమాని. చంద్రబాబు అంటే… pic.twitter.com/DmhdvU7YBd
— Telugu Desam Party (@JaiTDP) July 5, 2025