Samantha: అమెరికాలో జరుగుతున్న తానా 24వ మహాసభలు మూడో రోజూ ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా స్టార్ హీరోయిన్ సమంత హాజరయ్యారు. వేదికపై మాట్లాడిన సమంత, తన మనసులో మాటలు వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
సమంత మాటల్లో భావోద్వేగం…
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… “ఈ వేదికపై నిలబడేందుకు నాకు 15 ఏళ్ల సమయం పట్టింది. తానా గురించి ప్రతి సంవత్సరం వింటుంటాను. కానీ ఇంత కాలం నాకు ఈ వేదికపై మాట చెప్పే అవకాశం రాలేదు. నా మొదటి సినిమా ‘ఏ మాయ చేశావే’ నుంచే మీరు నన్ను ఎంతో ప్రేమతో ఆదరించారు. నేను తీసుకునే ప్రతి నిర్ణయం ముందు తెలుగు ప్రజలు ఏం అనుకుంటారో ఆలోచిస్తాను. నా కెరీర్‌లో మీరు నాకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారు. మీరు నాకు ఇల్లు, కుటుంబం ఇచ్చారు” అని చెప్పారు.
ఓ బేబీ విజయం గుర్తు చేసుకున్న సమంత
తన సినిమా ఓ బేబీ గురించి మాట్లాడుతూ, ‘‘అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్‌ని అందుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఇక్కడ ఉండకపోయినా, మీ ప్రేమ ఎప్పుడూ నా మనసులో ఉంది. మీరు నాకు చాలా దూరంగా ఉన్నా, నిజంగా నాకు చాలా దగ్గరగా ఉన్నారు’’ అంటూ కృతజ్ఞతలు చెప్పారు.
ఇది కూడా చదవండి: Vijay Setupathi: కొడుకు కోసం.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి
ప్రేక్షకులు సమంత కోసం ఎదురు చూపులు
ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు సమంత కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. యాంకర్ నిఖిల్ ప్రేక్షకులను దగ్గరగా కలిసి ముచ్చటించారు. వారు తానా వేడుకల్లో అత్యంత ఇష్టపడిన విషయాలను, ఇంకా ఏదైన ఆకర్షణ కోసం ఎదురు చూస్తున్నారా అని అడిగారు. చాలామంది సమంతను చూడడానికే వచ్చినట్లు చెప్పారు. అదే సమయంలో జరిగిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తానా బృందం నుంచి సాదర ఆహ్వానం
అంతలో తానా బోర్డ్ సభ్యులు నాగేంద్ర కొడాలి, శశికాంత్ వల్లేపల్లి, నరేన్ కొడాలి, రాజా కసుకుర్తి, ప్రసాద్ నల్లూరి, సునీల్ పాంత్ర, లోకేష్ కొణిదెల వేదికపైకి వచ్చి సమంతను అభినందించారు. సమంతను చూసి పలువురు ఆనందంతో ఫోటోలు దిగారు. ఇలా తానా వేదికపై సమంత సందడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
Actress #Samantha got emotional during her speech at TANA Conference 2025. pic.twitter.com/LV6SBVZZ5g
— Whynot Cinemas (@whynotcinemass_) July 6, 2025