Nayanthara: ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తోంది నెట్ ఫ్లిక్స్. వెబ్ సీరీస్, మూవీస్, బయోపిక్స్, డాక్యుమెంటరీస్ వంటి వాటితో పాటు ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రెటీల కథలను కూడా ఓటీటీపై ఆవిష్కరిస్తోంది. ఇటీవల టాలీడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పై డాక్యుమెంటరీని రూపొందించి విజయాన్ని అందుకున్న నెట్ ఫ్లిక్స్ తాజాగా కోటీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార లైఫ్ పై ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఓ ప్రత్యేకమైన ఎపిసోడ్ ను రూపొందించింది. వంబర్ 18న ఇది స్ట్రీమింగ్ కానుంది.
ఇది కూడా చదవండి: Pushpa 3: ‘పుష్ప3’కి లీడ్ ఇవ్వనున్న మరో స్టార్!?
Nayanthara: చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చి ఇవాళ లేడీ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న నయన్ జీవితంలో పలు ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకోక ముందే నయన్ జీవితంలో పలు ప్రేమాయణాలు ఉన్నాయి. శింబు, ప్రభుదేవాతో నయనతార నడిపిన ప్రేమకథలపై ఎన్నో కథనాలు వచ్చాయి. ఇక స్టార్ హీరో్యిన్ గా ఎదిగిన నయన్ తన సినిమాల ప్రచారంలోనూ పాల్గొనదు. ఈ అంశాలన్నింటినీ ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’లో ప్రస్తావిస్తారా? చేస్తే నయన్ ఏమన్నది. వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే 18వ తేదీ వరకూ ఆగక తప్పదు.