Ajay Devgn: బాలీవుడ్ బిగ్గీస్ అజయ్ దేవగన్, రవీనా టాండన్ నట వారసులు జంటగా కనిపించబోతున్నారు. అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్, రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని జంటగ నటిస్తున్న చిత్రమే ‘ఆజాద్’. అభిషేక్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్ స్టాలో ‘ఆజాద్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశాడు అజయ్ దేవగన్. స్నేహం, ప్రేమ, ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందట. ‘కహానీ యారీకీ, కహానీ వఫదారీ కీ. కహానీ ‘ఆజాద్ కీ’ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు అజయ్ దేవగన్.
ఇది కూడా చదవండి: Allu Arjun: థమ్స్ అప్ షూట్ లో అల్లు అర్జున్
ఈ సినిమా టీజర్ దీపావళికి థియటరల్లో ప్రదర్శితం కానుంది. ఈ అడ్వెంచన్ మూవీని 2025లో విడుదల చేస్తారట. తన మేనల్లుడుతో కలసి అజయ్ దేవగన్ ఈ మూవీలో నటించబోతున్నాడు. ఇక రవీనా టాండన్ కుమార్తె పై బాలీవుడ్ బిగ్గీలతో పాటు టాలీవుడ్ ప్రముఖుల కళ్ళు కూడా ఉన్నాయి. మోక్షజ్ఞ సినిమాలో తనే హీరోయిన్ అని కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రాషా టాండన్, అమన్ దేవగన్ ఈ సినిమా కోసం శిక్షణా తరగతులకు కూడా హాజరవుతున్నారట. రోనీ స్ర్కూవాలా, ప్రజ్ఞా కపూర్ సమర్ఫణలో అభిషేక్ నయ్యర్, అభిషేక్ కపూర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.