Nayanthara: నయన్ – ధనుష్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ధనుష్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ ఉన్నా… అతని తండ్రి కస్తూరి రాజా మాత్రం ఇలాంటి విషయాల మీద స్పందించేంత తీరిక తమకు లేదని తేల్చి చెప్పేశాడు. అలానే రెండేళ్ళ పాటు అనుమతి కోసం ఎదురు చూశామని నయన్ తార చెప్పిన విషయంలో వాస్తవం లేదని ఖండించాడు. ఓ నిర్మాతగా తన సినిమాకు సంబంధించిన హక్కుల విషయమై నిర్ణయం తీసుకునే అధికారం ధనుష్ కు ఉంటుందని వెనకేసుకు వచ్చాడు. ఇదిలా ఉంటే… నయన్ బర్త్ డే సందర్భంగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీకి విశేషమైన స్పందన లభించింది.
ఇది కూడా చదవండి: Dhanush vs Nayanthara: ధనుష్ వర్సెస్ నయన్!
Nayanthara: నిజానికి ఇది నయన్, విఘ్నేష్ కు సంబంధించిన పెళ్ళి వీడియోనే అయినా… నయన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన క్రమాన్ని కూడా ఇందులో చూపడంతో ఆసక్తి నెలకొంది. అయితే… తాజాగా నయన్ తన డాక్యుమెంటరీ రూపకల్పనకు తమ చిత్రాల విజువల్స్ ను ఇచ్చిన నిర్మాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసింది. ఎలాంటి ఆలస్యం లేకుండా పెద్ద మనసుతో వారంతా తనకు సహకరించారని నొక్కి మరీ చెప్పింది. ఆమె తాజా చర్య… ధనుష్ ను మరింతగా హర్ట్ చేయడానికే అన్నట్టుగా ఉందని కొందరు నెటిజన్స్ తప్పు పడుతున్నారు.