Fecilitation to br naidu

రండి.. అభినందించండి.. టీటీడీ ఛైర్మన్ ఆత్మీయ సత్కారంలో పాల్గొనండి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా బీ ఆర్ నాయుడు ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రైతు కుటుంబంలో పుట్టి.. ప్రభుత్వ ఉద్యోగిగా హైదరాబాద్ చేరి.. వ్యాపారవేత్తగా మారి.. మీడియా ప్రతినిధిగా ఎదిగి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అపూర్వ అవకాశం అందుకున్న బీఆర్ నాయుడును మీడియా తరఫున సత్కరించాలని నిర్ణయించారు. మహా న్యూస్ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
హైదరాబాద్ దసపల్లా హోటల్ లో నవంబర్ 23, శనివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆహ్వాన కమిటీ ప్రతినిధులు తెలిపారు. మీడియా ప్రతినిధులు అందరూ హాజరై బీఆర్ నాయుడు సత్కార సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jagan: అడ్డంగా దొరికేసిన జగన్‌..మహా చేతికి US SEC రిపోర్ట్‌..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *