narendra modi

Narendra Modi: నేడు మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటన

Narendra Modi: నేడు మహారాష్ట్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అకోలాలో.. దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్‌లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే, చిమూర్ (చంద్రాపూర్ జిల్లా), షోలాపూర్‌లలో జరిగే ర్యాలీలలో సైతం మోడీ ప్రసంగిస్తారు.

ఇది కూడా చదవండి: Ranthambore National Park: 75 పులులలో 25 తప్పిపోయాయి

Narendra Modi: ఈనెల 12న చిమూర్‌, షాలాపూర్‌లో బహిరంగ సభలో మోడీ పాల్గొనున్నారు. అదే రోజు సాయంత్రం పుణెలో ప్రధాని మోదీ రోడ్‌షో జరగనుంది. ఈ నెల 14న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్, రాయ్‌గఢ్, ముంబైలో మూడు చోట్ల ర్యాలీల్లో మోడీ ప్రసంగిస్తారు. బారామతి నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించాల్సిందిగా తాను ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించలేదని.. దానివల్లే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్  తెలిపారు. నవంబర్ 20వ తేదీన 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. మరోవైపు, మహావికాస్ అఘాడి సైతం ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *