Siree Lella

Siree Lella: పవర్ స్టార్ సినిమాలో నారా వారి కోడలు?

Siree Lella: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ చిత్రాల లైనప్‌లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సంచలన అప్‌డేట్ బయటకు వచ్చింది.

చంద్రబాబు నాయుడి తమ్ముడు నారా రామ్మూర్తి కుమారుడు నారా రోహిత్‌కి కాబోయే భార్య, నటి సిరి లేళ్ళ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించనున్నారట. ‘ప్రతినిధి-2’లో రోహిత్‌తో కలిసి నటించిన సిరి, ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇటీవల నిశ్చితార్థం జరిగింది. అయితే, నారా రోహిత్ తండ్రి మరణంతో వివాహం వాయిదా పడింది. ఇప్పుడు ‘ఓజీ’లో సిరి లేళ్ళ పాత్ర సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vaishnavi Chaitanya: ‘బేబీ’తో సత్తా చాటిన వైష్ణవి చైతన్య!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *