Suryakumar Yadav: ఈ ఐపీఎల్ సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 628 రన్స్ కొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల రికార్డును సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా సూర్యకుమార్ మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టాడు.
ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ నిలిచారు. 2010 సీజన్ లో సచిన్ 618 రన్స్ చేశాడు. అయితే ఆ సీజన్ ఫైనల్ లో ముంబైని చెన్నై ఓడించి కప్ ఎగురేసుకపోయింది. అయితే అప్పటి నుంచి ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ పేరు మీదే ఉంది. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 628 రన్స్ తో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
Also Read: Rishabh Pant: 54 బంతుల్లో సెంచరీ.. పంత్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడంటే-?
Suryakumar Yadav: అంతేకాకుండా మరో రికార్డును సైతం సూర్య నమోదు చేశాడు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా 14వ ఇన్నింగ్స్‌లో 25 పరుగుల మార్కును దాటాడు. దీంతో దక్షిణాఫ్రికా మాజీ టీ20 కెప్టెన్ టెంబా బావుమాను అధిగమించి సూర్య కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా లీగ్ దశలోని ప్రతి మ్యాచ్‌లో 25 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనతను సూర్య సాధించాడు.