Tarak: నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్‌ను తలచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అక్కడ గడిపిన క్షణాలు, వారి భావోద్వేగ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
తారక్ తన తాత గురించి హృదయస్పర్శిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “మీ ఆత్మ స్పర్శ లేక తెలుగు నేల బరువెక్కింది, మీ చిరస్థాయి రూపం లేక తెలుగు హృదయం కకావికలమైంది. మీ గొప్ప మనసుతో మరోసారి ఈ జాతిని తాకండి తాతా!” అంటూ రాసిన ఈ పోస్ట్ అభిమానులను కంటతడి పెట్టించింది.
Also Read: Mirai Teaser: సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ టీజర్.. తేజ సజ్జకు గ్లోబల్ హిట్ పక్కా!
Tarak: ఇదిలా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’లో నటిస్తుండగా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు చిత్రాలకు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబం, అభిమానులు ఆయన సినీ, రాజకీయ సేవలను స్మరించుకున్నారు.
— Jr NTR (@tarak9999) May 28, 2025