NARA LOKESH :అధికారంలో ఉన్నామనే అహం లేకుండా మరింతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉన్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. జూన్ 12 లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం పార్టీలో యనమల సలహాలు సూచనలు తీసుకుంటున్నా ఈసారి మహానాడు లో మండలాధ్యక్షులకు మాట్లాడే అవకాశం కల్పించాం రాబోయే ఐదు దశాబ్దాలు పార్టీ భవిష్యత్ బాగుండాలి అందుకే సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టాము లోకేష్ పార్టీ లో ఒక భాగమే… ఆయనే పార్టీ కాదు అని అన్నారు.
గడచిన ,11 నెలల్లో అన్ని ప్రాంతాలకు ప్రాజెక్ట్ లు వచ్చాయి రాయలసీమ లో రెన్యువల్ పవర్ తీసుకువచాo సజ్జన్ జిందాల్ కడప లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చారు మరో 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తున్నారు. చంద్రబాబు లా యోగా పార్టీలో మెమెవ్వరం చేయలేం చంద్రబాబు హార్ట్ చాలా యంగ్ నేను, అచ్చం నాయుడు శవాసనం వేస్తే హాయిగా నిద్ర పోవచ్చు అని చమత్కరించుకున్నాం మహిళలు ను గౌరవించాలి… ముందు రాజకీయ నాయకులు తమ భాషను మార్చుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులను సొసైటీ లో ఎక్కువమంది ఫాలో అవుతుంటారు మా తల్లి ఎంత ఆవేదన చెందింది అనే అంశం నేను కళ్ళారా చూసాను జగన్ కుటుంబం లో ఎవరిని కూడా ఒక్క మాట కూడా మేం అనడం లేదని చెప్పారు.
మా వాళ్ళు ఎవరు ఏమైనా మాట్లాడినా మేము ఉపేక్షించట్లేదు పాఠశాలల్లో ఇంగ్లీష్ తో పాటు తెలుగు, ఉర్ధూ ఇలా అన్ని మీడియం లకు ఆప్షన్ ఇస్తానని ఎన్నికల ముందు చెప్పానని అన్నారు.