Mirai

Mirai: ‘మిరాయ్’ టీజర్ హైప్.. ఒక్క పోస్టర్ తో నెట్టింటిని షేక్ చేస్తున్న తేజ సజ్జ!

Mirai: ‘హనుమాన్’ చిత్రంతో సూపర్ స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న తేజ సజ్జా, ఇప్పుడు ‘మిరాయ్’ అనే మరో సూపర్ న్యాచురల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ యోధ పాత్రలో కొత్త లుక్‌తో అదరగొట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో మనోజ్ మంచు శక్తివంతమైన విలన్‌గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. తాజా పోస్టర్‌లో తేజ రైలుపై డైనమిక్ యాక్షన్‌లో కనిపించి అభిమానులను ఆకర్షించాడు. పోస్టర్ చూడగానే ఓ డిఫరెంట్ అటెంప్ట్ కనిపిస్తుంది. మే 28న రాబోతున్న టీజర్ కచ్చితంగా సినిమాపై హైప్‌ను రెట్టింపు చేయనుంది. ఇప్పటికే రానా ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సినిమాపై అంచనాలను మరింత పెంచాడు. 8 భాషల్లో, 2డీ, 3డీ ఫార్మాట్లలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజా పోస్టర్ చూస్తుంటే.. తేజ సజ్జా కచ్చితంగా ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  BRS Fear About Media: బీఆర్‌ఎస్‌ రాజకీయం... మాట్లాడితే రాళ్లు, రాళ్లు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *