మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు మంత్రి నారా లోకేష్.తన స్వార్థం కోసం జగన్ అర్జెంట్ సెక్యూరిటీ పేరు చెప్పి.. ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.తాడేపల్లి ప్యాలెస్ కు ఇనుప కంచె వేసేందుకు అక్షరాలా రూ.12.85 కోట్లను స్వాహా చేశారని ఆరోపించారు.
ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల మేర ఇనుప కంచె నిర్మాణానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. 2021, జులై 19న ప్యాలెస్ ఫెన్సింగ్ కు సంబంధించిన ప్రొటోకాల్ లెటర్ ను లోకేశ్ షేర్ చేశారు.
కాగా జగన్ సీఎం గా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లేందుకు కఠిన ఆంక్షలు ఉండేది. ప్రభుత్వం మారాక ఆ రోడ్డుని పూర్తిగా జనాలు తిరిగేటట్టు అధికారులు సన్నాహాలు చేశారు. దీంతో అక్కడ భారీ ఇనుపకంచెలతో ఓ ప్యాలెస్ కనబడే సరికి జనం ఆశ్చర్యానికి గురయ్యారు. అది మాజీ సీఎం నివాసం అని తెలిసేసరికి షాక్కు గురయ్యారు.
https://x.com/naralokesh/status/1846448475099005278?t=JeRyqJuVIonZ_6jfINRbgw&s=19