ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ బాధ్యత అని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు.
పాదయాత్రలో తనకు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారని దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించాలని తెలిపారు.