Nara lokesh: రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం కావడం తాను ఎంతో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరించిందని లోకేశ్ తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. “గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని మంత్రి తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.