Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari: లండన్‌లో 2 ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి లండన్ పర్యటనలో రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్‌లోని మేఫెయిర్ హాల్/గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ గౌరవాలు దక్కాయి.

ప్రజాసేవకు ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’

ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) సంస్థ ప్రతినిధులు నారా భువనేశ్వరికి ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025’ అవార్డును ప్రదానం చేశారు. ప్రజా సేవా రంగం, సామాజిక ప్రభావం, నాయకత్వం అంశాల్లో ఆమె చేసిన విశిష్టమైన కృషికిగానూ ఈ గౌరవం లభించింది.

ఇది కూడా చదవండి: Nara Lokesh: టీడీపీ సీనియర్ నేతలపై లోకేష్‌ ఆగ్రహం

ఎన్టీఆర్ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ హోదాలో భువనేశ్వరి విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తుల్లో సహాయం వంటి అంశాల్లో విస్తృత సేవలందిస్తున్నారు. ముఖ్యంగా తలసేమియా రోగులకు ఉచిత రక్తమార్పిడి, రక్తదాన శిబిరాలు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆమె విశేష కృషి చేశారు.

కార్పొరేట్ గవర్నెన్స్‌కు ‘గోల్డెన్ పీకాక్ అవార్డు’

నారా భువనేశ్వరి వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఎండీ)గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు కూడా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. కార్పొరేట్ పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు గాను హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ లభించింది.

ఇది కూడా చదవండి: Flight Accident: పేలిన UPS విమానం..ముగ్గురు మృతి.. 11 మంది గాయాలు

ఈ అవార్డును కూడా వీసీఎండీ హోదాలో నారా భువనేశ్వరి స్వీకరించారు.

హెరిటేజ్‌ను దేశంలోనే ప్రతిష్ఠాత్మక డెయిరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దడం, సంస్థ ఎదుగుదల మరియు రైతుల సాధికారతకు కృషి చేయడంలో భువనేశ్వరి క్రియాశీలక పాత్ర పోషించారు.

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో నిలుస్తున్న తీరు పట్ల గర్వం వ్యక్తం చేశారు. లండన్ పర్యటనలో భాగంగా ఈ దంపతులు పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *