The Paradise: టాలీవుడ్‌లో సినిమా నిర్మాణం రోజురోజుకూ సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. థియేట్రికల్ రిలీజ్‌లలో స్టార్ హీరోల సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. ఈ నేపథ్యంలో, నిర్మాతలు కార్పొరేట్ సంస్థలతో షేర్ డీల్స్ ద్వారా ఫండింగ్ పొందుతున్నారు.
తాజాగా, న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది ప్యారడైజ్’కు ప్రముఖ నిర్మాణ సంస్థ సరిగమ ఫండింగ్ అందించేందుకు ముందుకొచ్చింది.‘ది ప్యారడైజ్’ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్ అవసరమైన ఈ ప్రాజెక్ట్‌కు సరిగమ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది.
Also Read: Ajay Devgan: సంచలనం.. అజయ్ దేవ్‌గణ్ ప్రైవేట్ జెట్ కొనుగోలు?
The Paradise: సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చి 26న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నాని – శ్రీకాంత్ కాంబినేషన్, సరిగమ లాంటి బడా సంస్థ బ్యాకింగ్‌తో ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేయనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ది ప్యారడైజ్ గ్లింప్స్ :

