Nani

Nani: ‘ప్యారడైజ్’లో నాని, శ్రీకాంత్ ఓదెల!

Nani: నానీ హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి ఇతర పాత్రలను పోషించారు. భారీ బడ్జెట్ తో సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నానీ కెరీర్ లో తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. 6 ఫిల్మ్ ఫేర్, 3 సైమా అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కలయికలో రెండో సినిమాను దసరా రోజున ఆరంభించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కూడా 1980 బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఈ సినిమాకు ‘ప్యారడైజ్’ అనే టైటిల్ ని నిర్ణయించనున్నట్లు వినిపిస్తోంది. ఈ మూవీ కథ ప్యారడైజ్ అనే ప్రాంతంలో జరుగుతుందట. పీరియాడికల్ డ్రామాగానే కాకుండా బోల్డ్ గా ఉంటుందని వినికిడి. దసరాను రా అండ్ రస్టిక్ వయొలెంట్ డ్రామాగా తీర్చిదిద్దిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పూర్తిగా ఆధునిక పీరియాడికల్ డ్రామాగా రూపొందించనున్నారట. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ భిన్నమైన స్క్రిప్ట్ లతో ముందుకు వెళుతున్న నానీ కి ‘ప్యారడైజ్’ కూడా మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిద్దాం. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *