Nandamuri Ramakrishna: నారా భువనేశ్వరికి ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ అభినందనలు తెలిపారు. మా నందమూరి ఇంట మహాలక్ష్మి..
నారా వారి గృహలక్ష్మి, మహిళా లోక ప్రియతమ ఆడపడుచు నారా భువనేశ్వరి గారికి తాను ప్రజలకు, సమాజానికి అందిస్తున్న సేవలు గాను, మా తండ్రిగారి పేరిట NTR ట్రస్ట్, NTR బ్లడ్ బ్యాంకు తరపున రక్తదానం కన్నా మించిన దానం లేదని ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ, NTR మోడల్ స్కూల్ తరపున అనాధ మరియు పేద ఇంట పిల్లలను చేరతీసి వారందరికీ ఉచితంగా చదువు చేపించి.. ఆ పిల్లలకు మంచి ఉద్యోగం భవిష్యత్తు కల్పించటం.. ఒక వైపు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను విజయవంతముగా ముందుకు నడిపిస్తూ.. నారా భువనేశ్వరి అందిస్తున్న సేవలను గుర్తుంచి “డిస్టింగ్యిష్ ఫెలోషిప్ అవార్డును” ఇన్నిస్టిట్యూట్ అఫ్ డైరెక్టర్స్ IOD సంస్థ వారు లండన్ అందించే ఈ అరుదైన అత్యున్నత అవార్డును మా సోదరి నారా భువనేశ్వరి గారికి అందించటం చానా గర్వకారణం, సంతోషదాయకం..
గతంలో ఈ అవార్డును సమాజానికి, దేశానికి సేవలందించిన మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి మరియు కిరణ్ బేడీ లాంటి పెద్దలకు దకింది.
మా దైవం మా తండ్రి నందమూరి తారకరామారావు గారి అడుగు జాడల్లో “సమాజమే దేవాలయం ప్రజల్లే దేవుళ్ళు” స్ఫూర్తిగా నారా భువనేశ్వరి గారి ఆలోచన, కృషి, పట్టుదలకు అభినందనలు తెలుపుతూ..
మీరు ఏ పని చేపట్టిన అత్యంత శిఖరాలకు ఎదగాలని కోరుతూ..
మీ..
ప్రియతమ సోదరుడు
నందమూరి రామకృష్ణ