Nallagonda:

Nallagonda: యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్కేంద్రం జాతికి అంకితం

Nallagonda: న‌ల్ల‌గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల మండ‌లంలో నిర్మించిన యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్కేంద్రాన్ని (వైటీపీఎస్‌) ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క శుక్ర‌వారం (ఆగ‌స్టు 1) జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల విద్యుదుత్ప‌త్తి సామ‌ర్థ్యం గ‌ల మొద‌టి యూనిట్‌ను జిల్లా మంత్రులు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌తో క‌లిసి ప్రారంభించారు. వారి వెంట శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి కూడా ఉన్నారు.

Nallagonda: యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్కేంద్రం (వైటీపీఎస్‌)లో 55 ఎక‌రాల్లో రూ.970 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి మంత్రులు ఈ సందర్భంగా శంకుస్థాప‌న చేశారు. వ‌న మ‌హోత్స‌వంలో భాగంగా వారంతా మొక్క‌లు నాటారు. భూనిర్వాసితుల‌కు ఆగ‌స్టు 15లోపు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని స్థానికుల‌కు మంత్రులు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా, వైటీపీఎస్ రెండో యూనిట్‌ను గ‌తంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *