Nallagonda:

Nallagonda: కూతురుపై తండ్రి లైంగిక‌దాడి.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

Nallagonda: కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన క‌న్న‌కూతురుపై తండ్రి లైంగిక‌దాడికి పాల్ప‌డిన కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడికి క‌ఠిన శిక్ష‌ను అమ‌లు చేసింది. ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆ మైన‌ర్‌పై అఘాయిత్యానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌పై ఆ దుండ‌గుకి ఏడాది త‌ర్వాత కోర్టు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. శిక్ష‌తోపాటు జ‌రిమానా కూడా చెల్లించాల‌ని ఆదేశించింది.

Nallagonda: న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌త్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సంచ‌ల‌నంగా మారింది. క‌ట్టంగూరు మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన ఆంజ‌నేయులు 2023 డిసెంబ‌ర్ 14న ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న త‌న కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచార‌ణ కొన‌సాగింది. నిందితుడిపై నేరం నిరూప‌ణ కావ‌డంతో 20 ఏళ్ల జైలు శిక్ష‌తోపాటు రూ.10 వేల జ‌రిమానా విధిస్తూ ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయ‌మూర్తి తాజాగా తీర్పునిచ్చారు.

Nallagonda: క‌న్న‌కూతుళ్ల‌పై కామాంధులైన తండ్రులు లైంగిక‌దాడులకు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌ల‌ను స‌భ్య‌స‌మాజం ఖండిస్తూనే ఉన్న‌ది. క‌ఠిన శిక్ష‌లు అమ‌ల‌వుతూనే ఉన్నా, ఇంకా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటుండ‌టం ఆందోళ‌న‌క‌రం. ఇంకా క‌ఠిన శిక్ష‌లు అమలైతేనే ఇలాంటి దుర్ఘ‌ట‌న‌లను రూపుమాపే అవ‌కాశం ఉంటుంద‌ని మాన‌వ‌తావాదులు కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *