Nalgonda: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు – నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష

Nalgonda: జిల్లాలోని పోక్సో కోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది. దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు మహమ్మద్ ఖయ్యుంకి మొత్తం 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

జడ్జి రోజా రమణి ఇచ్చిన ఈ తీర్పులో, నిందితుడు 2021లో బాలికపై లైంగిక దాడి జరిపినట్లు సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. ఈ ఘటనపై 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు కాగా, 2022 నుంచి విచారణ కొనసాగింది.

తీర్పు ప్రకారం:

అత్యాచార కేసు కింద 20 ఏళ్లు

పోక్సో చట్టం కింద 20 ఏళ్లు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద 10 ఏళ్లు

సెక్షన్ 506 (క్రిమినల్ ఇన్టిమిడేషన్) కింద 1 సంవత్సరం

మొత్తం 51 ఏళ్ల శిక్ష విధించారు. కోర్టు ఈ సందర్భంగా పేర్కొంటూ, “బాలికలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు కఠిన శిక్షలు తప్పనిసరి. ఈ తీర్పు సమాజానికి హెచ్చరికగా నిలవాలి” అని జడ్జి రోజా రమణి వ్యాఖ్యానించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *