Nagarjuna Akkineni: కింగ్ నాగార్జునకు… మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఓ బలమైన బంధం ఉంది. కేవలం తోటి హీరోలుగానే కాకుండా మంచి స్నేహితులు గానూ వారు మెలుగుతూ ఉంటారు. నాగార్జున కొన్నేళ్ళుగా కళ్యాణీ జ్యూయలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా చేసిన వాణిజ్య ప్రకటన గత ప్రకటనలకు పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో నాగార్జున… అచ్చు చిరంజీవి మాడ్యులేషన్ లో డైలాగ్స్ చెప్పడమే కాదు… పాట కు స్టెప్పులూ వేశారు. ఈ ప్రకటనల నాగార్జున భార్య చిరంజీవి అభిమాని, ఆమె అల్జీమర్స్ తో బాధపడుతూ ఉంటుంది. గతాన్ని గుర్తు చేయడం కోసం ఆమెకు ఇష్టమైన చిరంజీవి పాటలను నాగ్ పాడుతుంటాడు. హృదయానికి హత్తుకునేలానే కాదు… ఇటు నాగ్, అటు చిరు అభిమానులను ఆకట్టుకునేలా ఈ ప్రకటన సాగడం విశేషం. ఇది చిత్రసీమలోని స్టార్ హీరోల మధ్య ఓ ఆరోగ్యకరమైన వాతావరణానికి ప్రతీకగా నిలిచిందని నెటిజన్స్ నాగార్జునను అభినందిస్తున్నారు.
Kalyan Jeweller’s new ad !!
Chiru @KChiruTweets reference👌👌
Chiru Dialogue by @iamnagarjunaChiru Nag bonding always 👌 pic.twitter.com/QJeIo0q4gi
— Megastar (@Chirufan4ever) January 14, 2025